తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్న కాంగ్రెస్ నేత!

27-10-2021 Wed 15:07
  • కొత్త పార్టీని ప్రారంభించనున్న డాక్టర్ వినయ్
  • సాయంత్రం కాంగ్రెస్ కు రాజీనామా చేసే అవకాశం
  • డిసెంబర్ లో పార్టీ పేరు ప్రకటన
  • కేంద్ర మాజీమంత్రి శివశంకర్ తనయుడే వినయ్ 
New political party to come in Telangana
తెలంగాణలో మరో కొత్త పార్టీ ఏర్పాటు కాబోతోంది. కాంగ్రెస్ నేత డాక్టర్ వినయ్ కుమార్ ఈ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆయన పార్టీని ప్రారంభించనున్నారు. పార్టీ ఏర్పాటు నేపథ్యంలో హైదరాబాదులోని ఓ ఫంక్షన్ హాల్లో ఆయన తన మద్దతుదారులతో భేటీ అయ్యారు.

కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ కుమారుడే వినయ్ అనే విషయం గమనార్హం. ఈ సాయంత్రం ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. అనంతరం కొత్త పార్టీపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. కొత్త పార్టీ పేరును ఆయన డిసెంబర్ లో ప్రకటించనున్నట్టు సమాచారం.