షర్మిల పాదయాత్రలో యాంకర్ శ్యామల

27-10-2021 Wed 14:37
  • అక్కతో కలిసి నడవడం సంతోషంగా ఉందన్న శ్యామల
  • పాదయాత్రలో ప్రతి ఒక్కరు అక్కకు సమస్యలు చెప్పుకుంటున్నారని వ్యాఖ్య
  • అక్కతో కలిసి నడవడానికి సిద్ధమన్న శ్యామల
Anchor Shyamala participates in YS Sharmila padayatra
వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రకు మంచి స్పందన వస్తోంది. పాదయాత్ర సందర్భంగా ఆమె ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. పాదయాత్ర సందర్భంగా ఇప్పటికే ఆమెను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కలిశారు. తాజాగా ఈరోజు ఆమె పాదయాత్రలో యాంకర్ శ్యామల పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో మార్పు కోసం షర్మిల చేస్తున్న పాదయాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. షర్మిలతో కలిసి నడవడానికి తాను సిద్ధమని అన్నారు. గత ఎనిమిది రోజులుగా అక్క నడుస్తున్నారని... ప్రతి ఒక్కరు వారి సమస్యలను అక్కతో చెప్పుకుంటున్నారని... ఆ విషయాన్ని తాను స్వయంగా చూశానని చెప్పారు.

 ఒక సీఎం కూతురు, మరో సీఎం చెల్లెలు అయిన అక్క ఎంతో సంతోషంగా ఉండొచ్చని... కానీ వారి నాన్నగారి ఆశయాలను భుజాన వేసుకుని ముందుకు సాగుతుండటం చాలా గొప్ప విషయమని అన్నారు. అక్కతో కలిసి నడవడానికి తాను సిద్ధమని చెప్పారు.