జార్జి ఎవరెస్ట్ ను అధిరోహించిన లావణ్య త్రిపాఠి

27-10-2021 Wed 14:19
  • ఉత్తరాఖండ్ లోని జార్జ్ ఎవరెస్ట్ ఎత్తు 8,848 మీటర్లు
  • పర్వతారోహణ చేసి 'ఔరా' అనిపించిన ముద్దుగుమ్మ 
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
Lavanya Tripathi clims George Everest
ఇటీవలి కాలంలో సినీ హీరోయిన్లు అడ్వెంచర్లు చేస్తున్నారు. పురుషులకు ఏ మాత్రం తీసిపోని రీతిలో సాహసాలు చేస్తున్నారు. అదే కోవలో టాలీవుడ్ నటి లావణ్య త్రిపాఠి పర్వతారోహణ చేసి 'ఔరా' అనిపించింది. ఉత్తరాఖండ్ లోని జార్జ్ ఎవరెస్ట్ ను లావణ్య అధిరోహించింది. 8,848 మీటర్ల ఎత్తున్న శిఖరాన్ని ఎక్కింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2012లో లావణ్య తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 16కు పైగా సినిమాల్లో నటించింది.