కేసీఆర్ బయోపిక్ రెడీ.. విడుదల తేదీ ఖరారు!

27-10-2021 Wed 13:56
  • వడత్యా హరీశ్ దర్శకత్వంలో తెలంగాణ దేవుడు
  • టైటిల్ రోల్ పోషిస్తున్న శ్రీకాంత్
  • నవంబర్ 12న విడుదల చేయనున్న చిత్ర బృందం
KCR Biopic to Release On Nov 12th
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం తెలంగాణ దేవుడు. కేసీఆర్ పాత్రలో  శ్రీకాంత్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులూ దాదాపు అయిపోయాయి. దీంతో సినిమాను వచ్చే నెల 12న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.

దీనిని జీషన్ ఉస్మానీ, మహ్మద్ జాకీర్ ఉస్మాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జాకీర్ ఉస్మాన్ మూలకథను అందించారు. వడత్యా హరీశ్ దర్శకత్వంలో సినిమా రూపొందింది. నందన్ బొబ్బిలి స్వరాలు అందించారు.