ఆ రాష్ట్రాల‌న్నింటికీ ఏపీ నుంచే గంజాయి అందుతోంది: వీడియోలు పోస్ట్ చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్

27-10-2021 Wed 13:33
  • క‌ర్ణాట‌క‌కు వ‌చ్చే గంజాయి మొత్తం ఏపీ నుంచే
  • ఢిల్లీకి గంజాయి మొత్తం ఏపీ నుంచే
  • రాజ‌స్థాన్‌లో ప‌ట్టుబ‌డిన గంజాయి విశాఖ నుంచే వెళ్లింది
  • పూణె, ముంబైలో ఉన్న గంజాయి మొత్తం ఏపీ నుంచి వెళ్లిన‌దే
Kerala police also seized huge amounts of ganja from AP state
ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేంద్రంగా మాద‌క ద్ర‌వ్యాల ర‌వాణా జ‌రుగుతోంద‌ని ప‌లు రాష్ట్రాల పోలీసులు చేసిన ప్ర‌క‌ట‌న‌ల‌కు సంబంధించిన వీడియోల‌ను జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. క‌ర్ణాట‌క‌కు వ‌చ్చే గంజాయి మొత్తం ఏపీ నుంచే వ‌స్తోందని బెంగ‌ళూరు పోలీస్ క‌మిష‌న‌ర్ క‌మ‌ల్ పంత్ పేర్కొన్న వీడియోను ప‌వ‌న్ పోస్ట్ చేశారు.

ఢిల్లీకి గంజాయి మొత్తం ఏపీ నుంచే వ‌స్తోంద‌ని ఢిల్లీ డీసీపీ సంతోష్ కుమార్ మీనా చేసిన వ్యాఖ్య‌ల వీడియోనూ ప‌వ‌న్ పోస్ట్ చేశారు. అలాగే, రాజ‌స్థాన్‌లో ప‌ట్టుబ‌డిన గంజాయి విశాఖ నుంచే వెళ్లింద‌ని పేర్కొన్నారు. పూణె, ముంబైలో ఉన్న గంజాయి మొత్తం ఏపీ నుంచే వ‌చ్చింద‌ని మీడియాలో వ‌చ్చిన ఓ వీడియోనూ ఆయ‌న పోస్ట్ చేశారు. అలాగే, మ‌ధ్య‌ప్ర‌దేశ్, కేర‌ళ‌కు కూడా ఏపీ నుంచే గంజాయి అందుతోంద‌ని తెలిపే వీడియోల‌ను ప‌వ‌న్ వ‌రుస‌గా పోస్టు చేశారు.