రూ.1.83 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లను శ్రీ‌వారికి కానుకగా ఇచ్చిన భ‌క్తుడు

27-10-2021 Wed 13:13
  • 3.604 కిలోల బంగారు బిస్కెట్ల విరాళం
  • అందించిన కోయంబత్తూరుకు చెందిన ఎంఅండ్సీ ప్రాపర్టీస్
  • నైవేద్య విరామ సమయంలో మొక్కులు  
devotee gives gold biscuits for ttd
తిరుమల శ్రీ‌వారికి ఓ భక్తుడు రూ.1.83 కోట్ల విలువైన‌ బంగారు బిస్కెట్లు కానుకగా ఇచ్చాడు. ఆ బిస్కెట్ల బ‌రువు 3.604 కిలోలు ఉంటుంది. తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన ఎంఅండ్సీ ప్రాపర్టీస్ అండ్ డెవలప్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు ఈ రోజు ఉదయం శ్రీవారిని ద‌ర్శించుకుని ఆ కానుక అంద‌జేశారు.  

నైవేద్య విరామ సమయంలో మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డికి ఈ బిస్కెట్ల‌ను సంస్థ ప్ర‌తినిధులు అంద‌జేశారు.