gangula: బండి సంజ‌య్.. తడి బట్టలతో భాగ్య‌ల‌క్ష్మి అమ్మవారి గుడిలోకి వచ్చే దమ్ముందా?: తెలంగాణ‌ మంత్రి గంగుల‌

gangula slams bandi
  • బీజేపీ నేత‌లు చికెన్లు, గుడ్లు పంపిణీ చేస్తున్నారు
  • డ‌బ్బులు పంచామంటూ  మాపై ఆరోప‌ణ‌లు చేస్తున్నారు
  • ఆరోప‌ణ‌లు నిజ‌మేన‌ని ప్ర‌మాణం చేయాలి

హుజూరాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో టీఆర్ఎస్‌, బీజేపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజయ్ చేసిన ఆరోప‌ణ‌ల‌ను రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ తిప్పికొట్టారు. బీజేపీ నేత‌లు చికెన్లు, గుడ్లు పంపిణీ చేస్తున్నార‌ని ఆరోపించారు. డ‌బ్బులు పంచామంటూ  త‌మపై చేసిన‌ ఆరోప‌ణ‌లు నిజ‌మేన‌ని ప్ర‌మాణం చేయాల‌ని స‌వాలు విసిరారు.

చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి రావాల‌ని బండి సంజయ్ చెప్పారు. తడి బట్టలతో అమ్మవారి గుడిలోకి వచ్చే దమ్ముందా? అని నిల‌దీశారు. త‌ప్పు చేసిన వారికే  శిక్ష పడుతుందని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వాన్ని బండి సంజ‌య్ ప్ర‌శ్నించాల‌ని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News