డిసెంబర్ నాటికి నిఖిల్ '18 పేజెస్' రెడీ!

27-10-2021 Wed 11:57
  • ముగింపు దశలో '18 పేజెస్'
  • కథానాయికగా అనుపమ పరమేశ్వరన్
  • వచ్చే ఏడాదిలో విడుదల
  • లైన్లో మరో మూడు సినిమాలు
18 Pages movie update
నిఖిల్ తాజా చిత్రంగా '18 పేజెస్' రూపొందుతోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి, పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. సుకుమార్ స్క్రిప్ట్ అందించిన ఈ సినిమా ఈ పాటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ కరోనా కారణంగా షూటింగు విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది.

కరోనా సమయంలో .. షూటింగు అయినంతవరకూ అన్ని పాత్రలకు డబ్బింగ్ చెప్పించేశారు. ఇంకా ఓ 10 రోజుల పాటు చిత్రీకరణ జరిగితే షూటింగు పార్టు పూర్తవుతుంది. డిసెంబర్ నాటికి ఈ సినిమా అన్ని పనులను పూర్తి చేసుకుంటుంది. ఇక ఈ సినిమాతో పాటు నిఖిల్ చందూ మొండేటితో 'కార్తికేయ 2' కూడా చేస్తున్నాడు.

ఈ రెండు సినిమాల్లో కథానాయిక అనుపమ పరమేశ్వరన్ కావడం విశేషం. ఇక ఇవి కాకుండా నిఖిల్ మరో రెండు ప్రాజెక్టులను సెట్ చేసుకున్నాడు. అందులో ఒక సినిమా 'రెడ్ సినిమాస్' బ్యానర్ పై నిర్మితమవుతుండగా, కథానాయికగా ఐశ్వర్య మీనన్ అలరించనుంది. కెరియర్ పరంగా నిఖిల్ కి ఇది 19వ  సినిమా.