Etela Rajender: నాపై దాడి చేస్తారని భయంగా ఉంది: ఈటల రాజేందర్

TRS leaders may attack me says Etela Rajender
  • కుట్రలు, కుతంత్రాలతో ప్రచారం చేస్తున్నారు
  • నోట్ల కట్టలు, మద్యం సీసాలతో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు
  • కేసీఆర్ కు హుజూరాబాద్ ప్రజలు బుద్ధి చెపుతారు
హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం ఈరోజుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల ప్రధాన నేతలు ప్రచారంలో మునిగిపోయారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నేతలు తన మీద దాడి చేస్తారనే భయం తనకు ఉందని అన్నారు.

కుట్రలు, కుతంత్రాలతో ప్రచారపర్వాన్ని కొనసాగిస్తున్నారని ఆయన విమర్శించారు. నోట్ల కట్టలు, మద్యం సీసాలతో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎన్ ను ఓడించి కేసీఆర్ కు హుజూరాబాద్ ప్రజలు బుద్ధి చెపుతారని అన్నారు. టీఆర్ఎస్ నేతలు ఎంత ప్రయత్నించినా... పోలింగ్ రోజున ఏం చేయాలో ఓటర్లు అదే చేస్తారని చెప్పారు. టీఆర్ఎస్ పతనం హుజూరాబాద్ తో ప్రారంభమవుతుందని అన్నారు.
Etela Rajender
BJP
KCR
TRS
Huzurabad

More Telugu News