Somireddy Chandra Mohan Reddy: చాలాకాలం తర్వాత పెద్దాయనను కలిశాం: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భేటీపై సోమిరెడ్డి

Somireddy shares moments with Vice President of India Venkaiah Naidu
  • ఢిల్లీ వెళ్లిన సోమిరెడ్డి
  • మిత్రులతో కలిసి వెంకయ్యనాయుడిని కలిసిన వైనం
  • ఆప్యాయంగా పలకరించారన్న సోమిరెడ్డి 
  • కుటుంబ యోగక్షేమాలు అడిగారంటూ ట్వీట్
టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా తన మిత్రులు శ్రీనివాసులు రెడ్డి, జనార్దన్ రెడ్డిలతో కలిసి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిశానని సోమిరెడ్డి ట్విట్టర్ లో వెల్లడించారు.

చాలాకాలం తర్వాత పెద్దాయనను కలవడం ఆనందం కలిగించిందని తెలిపారు. ఆప్యాయంగా మాట్లాడారని, కుటుంబ యోగక్షేమాలు అడిగారని, కొవిడ్ అనంతరం నెల్లూరు జిల్లాలో పరిస్థితులు, ప్రజల బాగోగులపై ఆరా తీశారని సోమిరెడ్డి వివరించారు. తమ భేటీకి సంబంధించిన ఫొటోలను కూడా సోమిరెడ్డి పంచుకున్నారు.
Somireddy Chandra Mohan Reddy
Venkaiah Naidu
Vice President Of India
New Delhi

More Telugu News