'రాధేశ్యామ్' నుంచి 'ప్రేరణ'ను పరిచయం చేయనున్న చిత్రబృందం... పూజా హెగ్డేపై టీజర్!

27-10-2021 Wed 09:40
  • ప్రభాస్, పూజా హెగ్డే జంటగా 'రాధేశ్యామ్'
  • రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చిత్రం
  • ఇప్పటికే ప్రభాస్ పై టీజర్ రిలీజ్
  • త్వరలో పూజా హెగ్డేపై టీజర్
Teaser from Radhe Shyam on Pooja Hegde role coming soon
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'రాధేశ్యామ్'. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. కాగా ఈ చిత్రంలో ప్రభాస్ రోల్ పై ఇప్పటికే టీజర్ వచ్చింది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం టీజర్ ను కానుకగా అందించింది. ఇక, 'రాధేశ్యామ్' చిత్రంలో 'ప్రేరణ' పాత్ర పోషిస్తున్న పూజా హెగ్డేకు సంబంధించిన టీజర్ ను కూడా అభిమానుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్య అనే పామిస్ట్ (హస్తసాముద్రికుడు) పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. తన ప్రేయసి ప్రేరణ జాతకం విక్రమాదిత్యకు తెలుస్తుందని, దీని ఆధారంగానే కథ అల్లుకున్నారని టాక్ వినిపిస్తోంది. పీరిడ్ డ్రామాగా తెరకెక్కుతున్న 'రాధేశ్యామ్' చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.