Ritu Varma: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Ritu Varma in a pukka mass song first time in her career
  • తొలిసారి మాస్ సాంగులో రీతూవర్మ 
  • పవన్ కల్యాణ్ సరసన 'ఏజెంట్' భామ
  • 'బంగార్రాజు'కి రిలీజ్ డేట్ ఫిక్సయింది  
*  'తొలిసారిగా ఓ పక్కా మాస్ సాంగ్ చేశా'నని చెబుతోంది కథానాయిక రీతూవర్మ. లక్ష్మీసౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య, రీతూవర్మ జంటగా 'వరుడు కావలెను' సినిమా రూపొందింది. ఇందులో తాను తొలిసారిగా మాస్ సాంగ్ చేశాననీ, ఇది ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని రీతూ చెప్పింది. ఈ పాట కోసం తాను చాలా కష్టపడ్డానని తెలిపింది. ఈ సినిమా ఈ నెల 29న రిలీజ్ అవుతోంది.
*  ప్రస్తుతం అఖిల్ సరసన 'ఏజెంట్' సినిమాలో నటిస్తున్న సాక్షి వైద్య ఇప్పుడు లక్కీ ఛాన్స్ కొట్టింది. పవన్ కల్యాణ్ సరసన నటించే అవకాశం ఆమెకు వస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ హీరోగా రూపొందే సినిమాలో కథానాయికగా సాక్షి వైద్యను ఎంచుకున్నట్టు తాజా సమాచారం.
*  అక్కినేని నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న 'బంగార్రాజు' చిత్రం వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని నాగార్జున నిర్ణయించినట్టు తెలుస్తోంది.
Ritu Varma
Sakshi Vaidya
Pawan Kalyan
Nagarjuna

More Telugu News