మరోసారి పాక్ బౌలర్ల విజృంభణ... న్యూజిలాండ్ 134/8

26-10-2021 Tue 21:25
  • టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ వర్సెన్ న్యూజిలాండ్
  • సత్తా చాటిన పాక్ బౌలింగ్ దళం
  • రవూఫ్ కు 4 వికెట్లు
  • ఓ మోస్తరు స్కోరుతో సరిపెట్టుకున్న కివీస్
Pakistan bowlers once again fires
టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ బౌలర్ల విజృంభణ కొనసాగుతోంది. భారత్ పై విజయంలో కీలకపాత్ర పోషించిన బౌలర్లు... నేడు న్యూజిలాండ్ తో మ్యాచ్ లోనూ తమ సత్తా చాటారు. పాక్ బౌలర్ల ధాటికి ఏ దశలోనూ కివీస్ బ్యాటింగ్ ఆశాజనకంగా సాగలేదు. ఓవర్లన్నీ ఆడి 8 వికెట్లకు 134 పరుగులు చేశారు. ఓపెనర్ డారిల్ మిచెల్ 27, డెవాన్ కాన్వే 27, కెప్టెన్ కేన్ విలియమ్సన్ 25 పరుగులు చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో ఎక్స్ ప్రెస్ పేసర్ హరీస్ రవూఫ్ 4 వికెట్లతో కివీస్ రెక్కలు విరిచాడు. షహీన్ అఫ్రిది 1, ఇమాద్ వాసిం 1, మహ్మద్ హఫీజ్ 1 వికెట్ తీశారు.