జీ5లో రేపు 'శ్రీదేవి సోడా సెంటర్' ఓటీటీ ట్రైలర్ రిలీజ్

26-10-2021 Tue 20:47
  • సుధీర్ బాబు, ఆనంది జంటగా శ్రీదేవి సోడా సెంటర్ చిత్రం
  • దీపావళి నుంచి జీ5లో స్ట్రీమింగ్
  • ఓటీటీ కోసం స్పెషల్ గా ట్రైలర్
  • అక్టోబరు 27 మధ్యాహ్నం 3 గంటలకు ట్రైలర్ రిలీజ్
Sridevi Soda Center trailer cut set to release tomorrow
సుధీర్ బాబు, ఆనంది జంటగా వచ్చిన చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'. ఇప్పటికే థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం వచ్చే నెల 4 నుంచి జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో జీ5 ఓటీటీ కోసం 'శ్రీదేవి సోడా సెంటర్' చిత్రానికి సంబంధించి ప్రత్యేకంగా ట్రైలర్ రూపొందించారు. ఈ ట్రైలర్ కట్ ను రేపు (అక్టోబరు 27) మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయనున్నారు. 'పలాస 1978' ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'శ్రీదేవి సోడా సెంటర్' చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు.