కేటీఆర్ సమర్థుడు కనుకనే ఫ్రాన్స్ దేశం ఆహ్వానించింది: మంత్రి శ్రీనివాస్ గౌడ్

  • ముగిసిన టీఆర్ఎస్ ప్లీనరీ
  • ప్లీనరీ విజయవంతమైందన్న శ్రీనివాస్ గౌడ్
  • కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడని కితాబు
  • కేసీఆర్ తర్వాత కేటీఆరేనని ఉద్ఘాటన
Srinivas Goud says KTR have capabilities

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ ప్లీనరీ ముగిసిన నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమర్థుడు కాబట్టే సదస్సులో పాల్గొనాలంటూ ఫ్రాన్స్ దేశం నుంచి ఆహ్వానం అందిందని తెలిపారు. ఓ పరాయిదేశం నుంచి ఆహ్వానం అందుకోవడంలోనూ పైరవీలు ఉంటాయా? అంటూ విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడు అని కొనియాడారు. కేసీఆర్ తర్వాత కేటీఆరేనని స్పష్టం చేశారు.

టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ విజయవంతం కావడంతో విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు. ప్లీనరీ జరిగిన తీరు చూస్తే టీఆర్ఎస్ మరో 20 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందన్న నమ్మకం కలుగుతోందని, సీఎం కేసీఆర్ వంటి నేత తమకూ కావాలని పొరుగునే ఉన్న ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా కోరుకుంటున్నారని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

More Telugu News