వెస్టిండీస్ ను అలవోకగా ఓడించిన సఫారీలు

26-10-2021 Tue 19:20
  • టీ20 వరల్డ్ కప్
  • సూపర్-12 దశలో వెస్టిండీస్ వర్సెస్ దక్షిణాఫ్రికా
  • 8 వికెట్ల తేడాతో నెగ్గిన సఫారీలు
  • మార్ క్రమ్ అర్ధసెంచరీ
South Africa beat West Indies
టీ20 వరల్డ్ కప్ సూపర్-12 దశలో భాగంగా నేడు వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ పోరులో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో సునాయసంగా నెగ్గింది. తొలుత కరీబియన్లను 143 పరుగులకే పరిమితం చేసిన సఫారీలు... ఆపై 18.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకున్నారు.

ఐడెన్ మార్ క్రమ్ 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేసి దక్షిణాఫ్రికా విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. మరో ఎండ్ లో వాన్ డుర్ డుస్సెన్ 43 పరుగులు నమోదు చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే కెప్టెన్ టెంబా బవుమా 2 పరుగులు చేసి అవుట్ కాగా, మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ 39 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో అకీల్ హోసీన్ 1 వికెట్ తీశాడు.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్థాన్

టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాపై చారిత్రాత్మక విజయం సాధించి మాంచి ఊపుమీదున్న పాకిస్థాన్ సూపర్-12 దశలో నేడు రెండో మ్యాచ్ ఆడుతోంది. షార్జాలో న్యూజిలాండ్ తో తలపడుతోంది. ఈ పోరులో టాస్ గెలిచిన పాక్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. భారత్ తో గెలిచిన జట్టునే ఈ మ్యాచ్ లోనూ కొనసాగిస్తున్నట్టు పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ వెల్లడించాడు.