సినిమా నిర్మాణం వైపు పూరి కూతురు?

26-10-2021 Tue 18:57
  • చెల్లెలికి నటనపై ఇంట్రెస్ట్ లేదన్న ఆకాశ్ 
  • చిన్నప్పుడు నాన్న నటింపజేశాడు 
  • ఇక తెరపై కనిపించే అవకాశం లేదు  
  • తనకి నిర్మాణ వ్యవహారాల పట్ల ఆసక్తన్న ఆకాశ్ 
Akash Puri Said about pavithra
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా 'రొమాంటిక్' సినిమా రూపొందింది. కేతిక శర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఈ నెల 29వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో పూరి కూతురు పవిత్ర కూడా సినిమాల్లోకి రానున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

తాజా ఇంటర్వ్యూలో ఆకాశ్ కి ఇదే ప్రశ్న ఎదురైంది. అందుకు ఆకాశ్ స్పందిస్తూ .. "పవిత్రకి మొదటి నుంచి కూడా యాక్టింగ్ పై ఇంట్రెస్ట్  లేదు, నాతో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది .. అప్పుడు కూడా ఆమెకి ఇష్టం లేదు. సరదాగా నాన్నే పట్టుబట్టి చేయించాడు. ఆమె యాక్టింగ్ వైపు వచ్చే అవకాశం లేదు.

మొదటి నుంచి కూడా పవిత్రకి ప్రొడక్షన్ వైపు ఆసక్తి ఎక్కువ. అందువలన భవిష్యత్తులో ఆమె సినిమాల నిర్మాణ వ్యవహారాలు చూసుకునే అవకాశం ఉంది" అని చెప్పుకొచ్చాడు. ఆకాశ్ మాటలను బట్టి చూస్తే, త్వరలో సొంత బ్యానర్ కి సంబంధించిన విషయాలు పవిత్ర చూసుకుంటుందేమో!