Varun Tej: రేపే 'గని' నుంచి ఫస్టు సింగిల్     

  • బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథ 
  • సయీ మంజ్రేకర్ పరిచయం 
  • కీలకపాత్రలో సునీల్ శెట్టి 
  • డిసెంబర్ 3వ తేదీన విడుదల
Ghani Song Promo Released

వరుణ్ తేజ్ కథానాయకుడిగా 'గని' సినిమా రూపొందింది. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా నిర్మితమైంది. అల్లు బాబీ - సిద్ధు ముద్ద ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా, డిసెంబర్ 3వ తేదీన విడుదల కానుంది.

తాజాగా ఈ సినిమా నుంచి సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. 'దే కాల్ హిమ్ గని .. కనివిని ఎరుగని' అంటూ సాగుతోంది. ఫస్టు సింగిల్ ను రేపు ఉదయం 11:08 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ సాంగ్ కూడా బాక్సింగ్ నేపథ్యంలో సాగేదిగానే అనిపిస్తోంది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ విదేశాల్లో శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే.

 వరుణ్ తేజ్  సరసన నాయికగా సయీ మంజ్రేకర్ కనువిందు చేయనుంది. ఇతర ముఖ్య పాత్రల్లో సునీల్ శెట్టి .. ఉపేంద్ర .. నవీన్ చంద్ర కనిపించనున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ  సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో వరుణ్ తేజ్ ఉన్నాడు.

More Telugu News