Betting: క్రికెట్ లైవ్ గురు యాప్ ద్వారా జోరుగా బెట్టింగ్ సాగుతోంది: రాచకొండ సీపీ మహేశ్ భగవత్

Police arrests cricket betting racket in Hyderabad
  • యూఏఈ, ఒమన్ వేదికగా టీ20 వరల్డ్ కప్
  • వరల్డ్ కప్ మ్యాచ్ లపై బెట్టింగ్
  • సమాచారం తెలిస్తే పోలీసులకు చెప్పాలన్న సీపీ
  • నగదు బహుమతి ఇస్తామని వెల్లడి
ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో ఆ మ్యాచ్ లపై బెట్టింగ్ జోరుగా సాగుతోందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు. క్రికెట్ లైవ్ గురు యాప్ ద్వారా బెట్టింగ్ జరుగుతోందని తెలిపారు. బెట్టింగ్ గురించి ఏదైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. బెట్టింగ్ సమాచారం ఇచ్చిన వారికి నగదు బహుమతి ఇస్తామని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

హైదరాబాదులోని ఎల్బీ నగర్ లో బెట్టింగ్ ముఠాను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంగా సీపీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి నుంచి రూ.14.92 లక్షల నగదు, పలు ఫోన్లు, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు.
Betting
App
Police
Telangana
T20 World Cup

More Telugu News