ప్రభాస్ గారిని ఎప్పటికీ మరిచిపోలేను: ఆకాశ్ పూరి

26-10-2021 Tue 17:21
  • నా చిన్నప్పటి నుంచి ప్రభాస్ గారు తెలుసు
  • తనే ఈ సినిమా ప్రమోట్ చేస్తానని అన్నారు
  • ముంబై వెళ్లి అక్కడ ఆయనను కలిశాను
  • ఒక రోజంతా మా కోసం కేటాయించారు  
Rocketry movie update
ఆకాశ్ పూరి హీరోగా 'రొమాంటిక్' సినిమా రూపొందింది. పూరి సొంత బ్యానర్లో నిర్మితమైన సినిమా ఇది. ఆయన కథ .. స్క్రీన్ ప్లే .. మాటలు అందించడం విశేషం. అలాంటి ఈ సినిమా ద్వారా అనిల్ పాదూరి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కథానాయికగా కేతిక శర్మకి తెలుగులో ఇది తొలి సినిమా

ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఆకాశ్ పూరి మాట్లాడుతూ . "నా చిన్నప్పటి నుంచి కూడా  నాన్న - ప్రభాస్ చాలా క్లోజ్. అందువలన మేము అడగకుండానే ఆయన ఈ సినిమాను ప్రమోట్ చేస్తానని చెప్పారు. ముంబై షూటింగులో బిజీగా ఉన్న ఆయన, ఈ సినిమా కోసం ఒక రోజును కేటాయించారు.

ఆయనతో గడిపిన ఆ రోజును నేను ఎప్పటికీ మరిచిపోలేను. అలాగే రమ్యకృష్ణ గారితో కలిసి నటించడం కూడా మరిచిపోలేని జ్ఞాపకం. నా తదుపరి సినిమా 'చోర్ బజార్' షూటింగును పూర్తిచేసుకుంది. మరో మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది" అని చెప్పుకొచ్చాడు.