Roja: చెత్తపై పన్ను వేయడానికి కారణమిదే: రోజా

  • పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే పన్ను విధించాం
  • ఉచితం అయితే ప్రజల్లో బాధ్యత ఉండదు
  • చెత్తపై పన్నుతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏమీ లేదు
This is the reason to impose tax on garbage says Roja

చెత్తపై పన్ను వేయడంపై ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ... పారిశుద్ధ్యం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకే చెత్త మీద పన్ను విధించడం జరిగిందని అన్నారు. ఉచితం అయితే ప్రజలు బాధ్యతగా ఉండరని... అందుకే రోజుకొక రూపాయి పన్ను వేశామని చెప్పారు. చెత్తపై వేసిన పన్నుతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏమీ లేదని అన్నారు.

ఇల్లు, వీధి, గ్రామం పరిశుభ్రంగా ఉంటే ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంపై ప్రజల్లో వాలంటీర్లు, కార్యకర్తలు చైతన్యాన్ని నింపాలని అన్నారు. ఇంట్లోని తడి, పొడి, హానికరమైన చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని చెప్పారు.

More Telugu News