చిత్ర నిర్మాణ రంగంలోకి అమలా పాల్... సొంతంగా ప్రొడక్షన్ హౌస్

26-10-2021 Tue 15:39
  • నిర్మాత అవతారం ఎత్తిన అమలాపాల్
  • 'అమలాపాల్ ప్రొడక్షన్స్' పేరిట నిర్మాణ సంస్థ
  • 'కడావర్' పేరిట తమిళంలో తొలి చిత్రం
  • ప్రధాన పాత్ర పోషిస్తున్న అమలాపాల్ 
Amala Paul turns as producer
దక్షిణాది భాషల్లో అగ్రహీరోల సరసన పలు హిట్ చిత్రాల్లో నటించిన అమలాపాల్ కొత్తగా చిత్రనిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తోంది. తన పేరు మీద 'అమలాపాల్ ప్రొడక్షన్స్' అంటూ చిత్రనిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది. గత 12 ఏళ్లుగా చిత్రసీమలో కొనసాగుతున్నానని, ఈ పుష్కరకాలంలో తన కెరీర్ ఎంతో ఉజ్వలంగా సాగిందని, ఇప్పుడు కొత్త మార్గంలో పయనం ప్రారంభించానని అమలాపాల్ సోషల్ మీడియాలో వెల్లడించింది.

'కడావర్' పేరుతో తొలి చిత్రం నిర్మిస్తున్నానని, అందులో తాను నటిస్తున్నానని తెలిపింది. ఇదొక క్రైమ్ ఫోరెన్సిక్ థ్రిల్లర్ మూవీ అని వివరించింది. ఈ చిత్రానికి అనూప్ పణిక్కర్ దర్శకత్వం వహిస్తున్నట్టు అమలాపాల్ పేర్కొంది. అంతేకాదు, 'కడావర్' చిత్రంలో తన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసింది.