వరంగల్ లో రాద్ధాంతం చేస్తున్నారు... అందుకే 'కొండా' షూటింగ్ కోసం ఏలూరు వచ్చాం: వర్మ

26-10-2021 Tue 15:16
  • కొండా మురళి జీవితంపై బయోపిక్
  • తొలుత వరంగల్ లో చిత్రీకరించాలని భావించిన వర్మ
  • లొకేషన్ ఏలూరుకు మార్పు
  • ఏలూరు పరిసరాల్లో 15 రోజుల పాటు చిత్రీకరణ
Ram Gopal Varma shoots his movie Konda in Eluru
మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి జీవితగాథ ఆధారంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ 'కొండా' పేరుతో బయోపిక్ తీస్తున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ ను వరంగల్, హన్మకొండ పరిసర ప్రాంతాల్లో జరపాలని తొలుత నిర్ణయించారు. తాజాగా షూటింగ్ లొకేషన్ ను మార్చినట్టు వర్మ వెల్లడించారు. వరంగల్ లో రాద్ధాంతం చేస్తున్నారని, అందుకే 'కొండా' సినిమా షూటింగ్ ను ఏలూరు పరిసర ప్రాంతాల్లో జరుపుతున్నామని వెల్లడించారు.

ప్రస్తుతం వర్మ ఏలూరులోనే ఉన్నారు. ఇక్కడ 15 రోజుల పాటు చిత్రీకరణ ఉంటుందని తెలిపారు. పొలిటికల్ బయోపిక్ లు తీయడంలో వర్మకు విపరీతమైన ఆసక్తి అన్న సంగతి తెలిసిందే. ఆయన గతంలో రక్తచరిత్ర, వంగవీటి పేరిట సినిమాలు తీశారు.