Cricket: కోహ్లీ మాట్లాడవేం?.. షమీపై ట్రోలింగ్ పట్ల నెటిజన్ల నిలదీత

  • టీమిండియా ఆటగాళ్లకూ సూటి ప్రశ్న
  • ఇప్పటిదాకా స్పందించని బీసీసీఐ
  • వెంటనే అధికారికంగా ఖండించాలని డిమాండ్
Captain Kohli Kept Mum On Trolling On Shami

పాక్ తో ఓడిపోయాక షమీపై ట్రోలింగ్ జరుగుతోంది. దీనిపై మాజీలు స్పందించినా ఇటు బీసీసీఐ కానీ, అటు టీమిండియా ఆటగాళ్లు కానీ స్పందించలేదు. కెప్టెన్ కోహ్లీ, రోహిత్ శర్మ, మెంటార్ ధోనీలు ఇంత వరకు ఒక్క మాటైనా మాట్లాడలేదు. దీనిపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సహచర ఆటగాడిపై అంతేసి ట్రోల్స్ వస్తున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు.

యూరో కప్ 2020లో ఇంగ్లండ్ కు చెందిన నల్లజాతి ఆటగాడిపై జాతివివక్ష కామెంట్ల పట్ల.. ఆ టీమ్ కెప్టెన్, తోటి ఆటగాళ్లంతా మండిపడ్డారు. సహచరుడికి అండగా నిలిచారు. మరి, టీమిండియా ఆటగాళ్లు ఎందుకు మాట్లాడట్లేదని నిలదీస్తున్నారు. మోకాళ్ల మీద కూర్చుని నిరసన వ్యక్తం చేస్తూ, ఎందుకు సంఘీభావం ప్రకటించట్లేదని ప్రశ్నిస్తున్నారు. దీనిపై బీసీసీఐ, కోహ్లీ వెంటనే అధికారికంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కశ్మీరీ విద్యార్థులపై దాడులు జరిగినప్పుడు వెంటనే స్పందించిన కోహ్లీ.. ఇప్పుడు షమీపై ట్రోలింగ్ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నాడని ఓ నెటిజన్ ప్రశ్నించాడు.

More Telugu News