ఓటీటీలోకి వచ్చేస్తున్న 'గల్లీ రౌడీ'

26-10-2021 Tue 12:25
  • థియేటర్లలో విడుదలై ప్రేక్షకాదరణ పొందిన 'గల్లీ రౌడీ'
  • నవంబర్ 4 నుంచి 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్'లో స్ట్రీమింగ్
  • ఈ చిత్రంలో సందీప్ సరసన సందడి చేసిన నేహాశెట్టి
Gully Rowdy movie to stream in OTT from November 4
టాలీవుడ్ యంగ్ హీర్ సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన 'గల్లీ రౌడీ' చిత్రం థియేటర్లలో విడుదలై ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. వినోదభరితంగా తెరకెక్కిన ఈ సినిమా సినీ అభిమానులను అలరించింది. ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు ఈ చిత్రం సిద్ధమవుతోంది. నవంబర్ 4వ తేదీ నుంచి 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన నేహాశెట్టి నటించింది. ఇతర ప్రధాన పాత్రలను రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళి, నాగినీడు, బాబీ సింహ, హర్ష తదితరులు పోషించారు. గల్లీ రౌడీ అయిన సందీప్ కిషన్ తన ప్రియురాలికి వచ్చిన సమస్యను, తన తాత కోరికను ఎలా తీర్చాడన్నదే ఈ సినిమా కథాంశం.