Prabhas: 'రాధేశ్యామ్' నుంచి వస్తున్న మరో టీజర్!

  • ఫస్టు టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్
  • సెకండ్ టీజర్ కి సన్నాహాలు
  • ఆకట్టుకోనున్న 6 పాటలు
  • జనవరి 14న సినిమా రిలీజ్
Radhe Shyam movie update

ప్రభాస్ .. పూజ హెగ్డే జంటగా 'రాధేశ్యామ్' సినిమా రూపొందింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి, ప్రభాస్ బర్త్ డే కానుకగా ఈ నెల 23వ తేదీన ఫస్టు టీజర్ ను వదిలారు.

ప్రభాస్ పాత్రను పరిచయం చేస్తూ సాగిన ఈ సినిమా టీజర్, భారీ స్థాయిలో వ్యూస్ ను దక్కించుకుంటూ దూసుకుపోతోంది. మేకర్స్ ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమా విజువల్ వండర్ గా ఉండనుందనే విషయం అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మరో టీజర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఈ సారి పూజ హెగ్డే పాత్రను పరిచయం చేస్తూ .. ఆమె వైపు నుంచి టీజర్ ఉండొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రభాస్ - పూజ కాంబినేషన్లోని సీన్స్ తో కూడిన టీజర్ ను వదిలే అవకాశం కూడా ఉందని అంటున్నారు. జస్టిన్ ప్రభాకరన్ స్వరపరిచిన 6 పాటలను కూడా, ఒకదాని తరువాత ఒకటిగా లిరికల్ వీడియోలుగా రానున్నాయని చెబుతున్నారు.

More Telugu News