సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- 'మ్యూజిక్ థెరపీ' అంటున్న ముద్దుగుమ్మ
- 'ఆదిపురుష్' చివరి షెడ్యూల్ లో ప్రభాస్
- వైష్ణవ్ తేజ్ తో బొమ్మరిల్లు భాస్కర్
* ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్' చివరి షెడ్యూలు షూటింగ్ నిన్న మొదలైంది. ప్రభాస్ కూడా ఈ షూటింగులో పాల్గొంటున్నాడు. ఇందులో కృతి సనన్ కథానాయికగా నటిస్తున్న సంగతి విదితమే.
* తాజాగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' చిత్రంతో విజయాన్ని అందుకున్న బొమ్మరిల్లు భాస్కర్ తన తదుపరి చిత్రాన్ని కూడా గీతా ఆర్ట్స్ సంస్థలో చేస్తున్నాడు. ఇందులో మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తాడని సమాచారం.