Sasikala: శశికళను పార్టీలోకి తీసుకోవడంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం: పన్నీర్ సెల్వం

  • గతంలో అన్నాడీఎంకే నుంచి శశికళ బహిష్కరణ
  • పార్టీలోకి వచ్చేందుకు శశికళ ఆసక్తి
  • అధినాయకత్వం చేతిలో చిన్నమ్మ భవితవ్యం
  • వస్తుంటారు, పోతుంటారు అంటూ పన్నీర్ సెల్వం వ్యాఖ్యలు
Panneer Selvam opines in Sasikala reentry into AIADMK

ఒకప్పుడు జయలలిత హయాంలో తెరవెనుక శక్తిలా అన్నాడీఎంకే రాజకీయాలను శాసించిన శశికళ పూర్వవైభవం కోసం పరితపిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.

అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించి, విడుదల అయ్యాక ఇటీవల తొలిసారి జయలిలత సమాధి వద్ద పెద్ద ఎత్తున సందడి చేశారు. గతంలో పార్టీ నుంచి బహిష్కరణకు గురైన చిన్నమ్మ మళ్లీ పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గత కొన్నిరోజులుగా అన్నాడీఎంకేలోకి శశికళ పునరాగమనంపై ప్రచారం ఊపందుకుంది.

దీనిపై పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం పన్నీర్ సెల్వం స్పందించారు. శశికళను పార్టీలోకి తీసుకోవడంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రాజకీయ పార్టీల్లో ఎవరు ఎప్పుడైనా వస్తుంటారు, పోతుంటారు అని అభిప్రాయపడ్డారు. శశికళ భవితవ్యాన్ని అన్నాడీఎంకే అధినాయకత్వం నిర్ణయిస్తుందని తెలిపారు.

More Telugu News