Charan: సెట్స్ పై చరణ్ మూవీ .. పాట కోసం 12 రోజులు!

shankar and Charan movie update
  • ఇటీవలే సెట్స్ పైకి శంకర్ సినిమా
  • పూణేలో జరుగుతున్న షూటింగు
  • పాట చిత్రీకరణలో బిజీగా టీమ్
  • భారీ బడ్జెట్ కేటాయించిన దిల్ రాజు
చరణ్ .. శంకర్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా, ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. ప్రస్తుతం పూణేలో ఈ సినిమా షూటింగు జరుగుతోంది. చరణ్ - కియారా అద్వాని మధ్య ఒక పాటను ప్లాన్ చేశారట. ఆ పాటను అక్కడ చిత్రీకరిస్తున్నారు.

ఈ పాట చిత్రీకరణ కోసం 12 రోజులను కేటాయించారు. సాధారణంగా ఒక పాట చిత్రీకరణకు 3 నుంచి 5 రోజులు తీసుకుంటారు. కానీ శంకర్ సినిమాల్లో పాటల సంగతి వేరు. ఆయన సినిమాల్లోని పాటలు భారీతనానికి నిదర్శనంగా నిలుస్తుంటాయి. పాట కోసమే ఆయన కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయిస్తూ ఉంటాడు.

అలా ఇప్పుడు చరణ్ .. కియారాపై చిత్రీకరిస్తున్న పాట కూడా అద్భుతమైన విజువల్స్ తో తెరపై ఆవిష్కృతమవుతుందట. అందుకోసం ఈ పాట చిత్రీకరణకు ఎక్కువ రోజులు తీసుకుంటున్నారని అంటున్నారు. ఈ పాటకి గల ప్రాధాన్యత కారణంగానే, దిల్ రాజు ఖర్చుకు వెనకాడలేదని చెప్పుకుంటున్నారు.
Charan
Kiara Advani
Shankar

More Telugu News