కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్

25-10-2021 Mon 17:18
  • మల్కాజ్ గిరి ఎమ్మెల్యేగా పని చేసిన రాజేందర్
  • రాజీనామా లేఖను సోనియా, రేవంత్ లకు పంపిన రాజేందర్
  • చర్చనీయాంశంగా మారిన ఆకుల రాజీనామా
Akula Rajender resigns to Congress
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గంలోని కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో పాటు రేవంత్ రెడ్డికి మెయిల్, ఫ్యాక్స్ ద్వారా పంపించారు.

గత కొంత కాలంగా ఆకుల పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ నేతలు హుజూరాబాద్ ఉపఎన్నికలో బిజీగా ఉన్న తరుణంలో... ఆకుల రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. మల్కాజ్ గిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆకుల ఎమ్మెల్యేగా గెలుపొందారు.