యూనివర్శిటీ నియామకాల్లో పక్షపాతాలకు తావుండకూడదు: జగన్

25-10-2021 Mon 15:31
  • నియామకాల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి
  • బోధనా సిబ్బందిలో ఉన్నతమైన ప్రమాణాలు ఉండాలి
  • ప్రతి వారం ఒక్కో వీసీతో చర్చలు జరపండి
Job Appointments should be transperant says Jagan
యూనివర్శిటీల్లో బోధనా సిబ్బంది నియామకాలలో పక్షపాతాలకు తావుండకూడదని అధికారులను ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని అన్నారు. బోధనా సిబ్బందిలో నాణ్యతతో పాటు ఉన్నతమైన ప్రమాణాలు ఉండేలా నియామకాలు ఉండాలని చెప్పారు. ప్రతి వారం ఒక్కో వీసీతో చర్చించాలని ఆదేశించారు.

యూనివర్శిటీల సమస్యలు, ప్రభుత్వ సహకారంపై వీసీలతో చర్చించాలని... ఆ సమావేశాల్లో చర్చించిన విషయాలను తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఉన్నత విద్యపై అధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పై సూచనలు చేశారు.