మంచు మనోజ్, రామ్ గోపాల్ వర్మ మధ్య ఆసక్తికర సంభాషణ

25-10-2021 Mon 15:02
  • 'మా' జోకర్లతో నిండిన సర్కస్ అన్న వర్మ
  • మీరు రింగ్ మాస్టర్ అన్న మనోజ్
  • నేను వినోదాన్ని పంచే కోతిని మాత్రమే అన్న వర్మ
Interesting tweets between Manchu Manoj and RGV
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నిక తర్వాత రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... ''మా' జోకర్లతో నిండిన సర్కస్' అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్ పై మంచు మనోజ్ స్పందిస్తూ... ''మా' సర్కస్ అయితే.. మీరు రింగ్ మాస్టర్' అని అన్నారు. దీనిపై వర్మ స్పందిస్తూ... 'సార్, నేను రింగ్ మాస్టర్ కాను. నేను వినోదాన్ని పంచే కోతిని మాత్రమే' అని అన్నారు. దీనికి మనోజ్ ప్రతిస్పందిస్తూ... 'మనందరం సేమ్ సర్కస్ కు చెందినవాళ్లమే సార్' అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై వర్మ స్పందిస్తూ... 'అవును' అని అన్నారు.