దీపావళికి ఓటీటీలో సందడి చేయనున్న 'శ్రీదేవి సోడా సెంటర్'

25-10-2021 Mon 14:39
  • సుధీర్ బాబు, ఆనంది జంటగా శ్రీదేవి సోడా సెంటర్
  • 'జీ5' ఓటీటీలో నవంబరు 4 నుంచి స్ట్రీమింగ్
  • కరుణకుమార్ దర్శకత్వంలో చిత్రం
  • ఇప్పటికే థియేటర్లలో విడుదల
Sridevi Soda Center set to stream on ZEE Five OTT
'పలాస..' ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'. ఈ సినిమా దీపావళి కానుకగా 'జీ5' ఓటీటీ వేదికపై సందడి చేయనుంది. 'శ్రీదేవి సోడా సెంటర్' నవంబరు 4 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్ నెమ్మదించిన తర్వాత థియేటర్లలో విడుదలైన చిత్రాల్లో 'శ్రీదేవి సోడా సెంటర్' కూడా ఒకటి.

ఈ చిత్రం ప్రేమ ఇతివృత్తానికి సంబంధించింది కావడంతో ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో నరేశ్, షావుల్ నవగీతమ్ కీలక పాత్రలు పోషించారు. 70ఎంఎం ఎంటర్టయిన్ మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, దేవిరెడ్డి శశి నిర్మించారు.