రాష్ట్రపతి భవన్ కు చేరుకున్న చంద్రబాబు

25-10-2021 Mon 12:44
  • రాష్ట్రపతి భవన్ కు పలువురు నేతలతో కలిసి వెళ్లిన చంద్రబాబు
  • టీడీపీ ఆఫీస్ ను ధ్వంసం చేయడంపై ఫిర్యాదు చేయనున్న బాబు
  • డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాపై నివేదిక అందించనున్న చంద్రబాబు
Chandrababu reaches Rashtrapati Bhavan
ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు కాసేపటి క్రితం రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు. ఆయనతో పాటు మరికొందరు టీడీపీ సీనియర్ నేతలు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో భేటీ అయ్యారు. టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడంపై ఈ సందర్భంగా రాష్ట్రపతికి చంద్రబాబు వివరించనున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఫిర్యాదు చేయనున్నారు. ఏపీలో డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాపై రాష్ట్రపతికి నివేదిక అందించనున్నారు. ఈ భేటీ తర్వాత పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవనున్నారు.