Dhanush: ఓటీటీ బాటలోనే ధనుశ్ 'మారన్'

Maaraan  movie update
  • విభిన్నమైన కథాకథనాలు 
  • విలక్షణమైన పాత్ర 
  • డిస్నీ హాట్ స్టార్ కి వెళ్లిన సినిమా 
  • అభిమానుల్లో అసంతృప్తి   
కోలీవుడ్ లో కొత్త కథలకు .. వైవిధ్యభరితమైన పాత్రలకు ప్రాధాన్యతనిచ్చే హీరోగా ధనుశ్ కనిపిస్తాడు. ప్రతి సినిమాలోనూ తన లుక్ .. తన పాత్ర కొత్తగా ఉండటానికి ఆయన ఇష్టపడతాడు. పాత్ర కోసం తెరపై ఎలా కనిపించడాకైనా ఆయన వెనుకాడడు. అలాంటి ధనుశ్ కి అక్కడ విపరీతమైన క్రేజ్ ఉంది.

ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి 'మారన్' సిద్ధంగా ఉంది. కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, డిస్నీ హాట్ స్టార్ లో విడుదల చేసే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ధనుశ్ 'జగమే తంత్రం' ఓటీటీలోనే విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే బాటలో వెళ్లనుండటంతో, సోషల్ మీడియా వేదికగా అభిమానులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

హింసకు దూరంగా ఉంటూ వచ్చే కథానాయకుడుకి అన్యాయం జరుగుతుంది. అహింసా మార్గంలో వెళితే న్యాయం జరగదు. అందువలన తాను హింసకు తెగబడతాడు. పర్యవసానాలు ఎలాంటివి? అనేదే కథ. ఈ సినిమాను ఓటీటీ ద్వారా వదలడం పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తున్న అభిమానులకు ధనుశ్ ఏం చెబుతాడో చూడాలి.
Dhanush
Karthik Naren
Kollywood

More Telugu News