బన్నీ కోసం స్క్రిప్ట్ రెడీ చేసిన బోయపాటి!

25-10-2021 Mon 11:27
  • బాలయ్యతో 'అఖండ' సినిమా పూర్తి
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
  • బన్నీ కాంబినేషన్లో మరో సినిమా
  • గతంలో హిట్ కొట్టిన 'సరైనోడు'
Allu Arjun in Boyapati movie
బోయపాటి సినిమాకి భారీతనం ప్రధమ లక్షణంగా కనిపిస్తుంది. భారీ బడ్జెట్ .. భారీ తారాగణం .. భారీ యాక్షన్ సీక్వెన్సులు .. ఇలా అన్ని అంశాలలో భారీ తనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అలాంటి బోయపాటి దర్శకత్వంలో రూపొందిన 'అఖండ' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలకృష్ణ కథానాయకుడిగా ఈ సినిమా నిర్మితమైంది.

ఈ సినిమా తరువాత ఆయన బన్నీతో చేయనున్నట్టు ఒక వార్త బలంగా వినిపిస్తోంది. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' వేదికపై బన్నీవాసు .. 'అన్ స్టాపబుల్' వేదికపై అల్లు అరవింద్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందన్నది మాత్రం చెప్పలేదు.

అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను బోయపాటి పూర్తి చేసినట్టుగా చెబుతున్నారు. ఇది యాక్షన్ తో కూడిన కామెడీ ఎంటర్టైనర్ అని అంటున్నారు. ప్రస్తుతానికి వేణు శ్రీరామ్ - 'ఐకాన్' ప్రస్తావన ఎక్కడా లేదు. అందువలన బోయపాటితో బన్నీ సెట్స్ పైకి వెళ్లనున్నాడనే విషయంలో క్లారిటీ వచ్చిందనే అనుకోవాలి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'సరైనోడు' వంటి హిట్ వచ్చిన సంగతి తెలిసిందే.