ములుగు జిల్లాలో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల హతం!

25-10-2021 Mon 10:54
  • పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్
  • ఘటనాస్థలంలో ఏకే-47, ఎస్ఎల్ఆర్ తుపాకుల స్వాధీనం
  • ఎన్ కౌంటర్ లో కమాండర్ స్థాయి మావోయిస్టు మృతి
3 Maoists dead in encounter
తెలంగాణలోని ములుగు జిల్లాలోని అటవీప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లింది. జిల్లాలోని వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకులగూడెం-చత్తీస్ గఢ్ అటవీప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలం నుంచి ఏకే-47, ఎస్ఎల్ఆర్ తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన మావోయిస్టుల్లో గతంలో వాజేడు-వెంకటాపురం ఏరియా కమాండర్ గా పని చేసిన సుధాకర్ కూడా ఉన్నట్టు భావిస్తున్నారు. ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.