ఇండియాలో తగ్గుతున్న కరోనా కేసులు.. కొత్తగా 14,306 కేసుల నమోదు

25-10-2021 Mon 10:31
  • గత 24 గంటల్లో 443 మంది మృతి
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,67,695
  • కేరళలో అత్యధికంగా 8,538 కేసుల నమోదు
India reports 14306 new cases
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 14,306 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 443 మంది మహమ్మారి కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,67,695 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 239 రోజుల్లో అతి తక్కువ యాక్టివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దేశంలో అత్యధిక కేసులు కేరళలో నమోదయ్యాయి. కేరళలో గత 24 గంటల్లో 8,538 కేసులు నమోదు కాగా... 71 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 3,41,89,774కి పెరిగాయి. ఇప్పటి వరకు 4,54,712 మంది కరోనా కారణంగా మృతి చెందారు.