వరుసగా పదోసారి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్.. నేడు ఏకగ్రీవంగా ఎన్నిక

25-10-2021 Mon 09:47
  • 27 ఏప్రిల్ 2001న కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ఆవిర్భావం
  • అప్పటి నుంచి వరుసగా అధ్యక్షుడిగా ఎన్నికవుతున్న కేసీఆర్
  • దేశంలో సుదీర్ఘకాలంపాటు పార్టీ అధినేతగా ఉన్న వ్యక్తుల్లో ఒకరిగా రికార్డుల్లోకి
KCR To be elect TRS chief consecutive 10th time
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వరుసగా పదోసారి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు. నేడు జరగనున్న పార్టీ ప్లీనరీలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. 27 ఏప్రిల్ 2001న కేసీఆర్ అధ్యక్షుడిగా 12 మంది ప్రతినిధులతో టీఆర్ఎస్ పురుడుపోసుకుంది. ఆ తర్వాత వరుసగా జరిగిన ప్లీనరీల్లో ఆయన అధ్యక్షుడిగా ఎన్నికవుతూ వచ్చారు. నేడు జరగనున్న ప్లీనరీ పదోది కాగా, ఈసారి కూడా పార్టీ నేతలు ఆయననే అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఫలితంగా సుదీర్ఘకాలంపాటు ఓ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్న వారి జాబితాలో కేసీఆర్ కూడా చేరనున్నారు.