సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

25-10-2021 Mon 07:30
  • సోషల్ మీడియాలో కాజల్ క్రేజ్ 
  • ఎన్టీఆర్ సినిమాకి సెట్ సిద్ధం
  • రాజమండ్రిలో శర్వా, రష్మిక    
Kajal gets Twenty Million followers on Insta
*  పెళ్లయినా కూడా కథానాయిక కాజల్ అగర్వాల్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. సినిమాల్లో ఆఫర్లు ఇంకా వస్తూనే వున్నాయి. అలాగే సోషల్ మీడియాలో కూడా ఆమె పాప్యులారిటీ తగ్గడం లేదు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఈ ముద్దుగుమ్మ ఫాలోవర్లు 20 మిలియన్లు దాటిపోయారు. కాజల్ క్రేజ్ ఇంకా పెరుగుతోందనడానికి ఇదే నిదర్శనం!
*  ఎన్టీఆర్, కొరటాల శివ కలయికలో రూపొందే భారీ చిత్రానికి సంబంధించిన భారీ సెట్ నిర్మాణం పూర్తయింది. జూబ్లీ హిల్స్ లో ఎన్టీఆర్ ఇంటికి సమీపంలోనే ఈ సెట్ ను వేయడం జరిగింది. త్వరలోనే ఈ చిత్రం షూటింగును ప్రారంభిస్తారు.
*  శర్వానంద్ హీరోగా రూపొందుతున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్రం తాజా షెడ్యూలు షూటింగు నిన్నటి నుంచి రాజమండ్రిలో జరుగుతోంది. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తోంది. ఈ షెడ్యూలులో ప్రధాన తారాగణం పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తారు.