చేపల కోసం గాలం వేస్తున్న బాలుడిని లాక్కెళ్లిన మొసలి

25-10-2021 Mon 06:50
  • కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఘటన
  • ఒడ్డున కూర్చున్న బాలుడిపై అమాంతం దాడి
  • గ్రామస్థులు గాలించినా ఫలితం శూన్యం
Crocodile killed boy in Karnataka
నది ఒడ్డున కూర్చుని చేపలకు గాలం వేస్తున్న ఓ బాలుడిపై మొసలి దాడిచేసి లాక్కెళ్లిపోయింది. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా దాండేలి తాలూకా వినాయకనగరలో ఈ ఘటన చోటుచేసుకుంది. మోహీన్ మహమూద్ అనే 15 ఏళ్ల బాలుడు నిన్న స్థానిక కాళీ నదిలో చేపల వేటకు వెళ్లాడు.

ఒడ్డున కూర్చుని చేపల కోసం గాలం వేస్తున్న సమయంలో మొసలి అమాంతం అతడిని లాక్కెళ్లిపోయింది. దీంతో భయంతో గ్రామంలోకి పరుగులు తీసిన అతడి స్నేహితులు విషయాన్ని గ్రామస్థులకు చెప్పారు. వారొచ్చి నదిలో గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.