5 ఓవర్లు పూర్తయినా ఒక్క వికెట్టూ పడలేదు!

24-10-2021 Sun 22:02
  • టీ20 వరల్డ్ కప్ లో భారత్ వర్సెస్ పాక్
  • మొదట బ్యాటింగ్ చేసిన భారత్
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 రన్స్
  • లక్ష్యఛేదనలో నిలకడగా పాక్
  • 5 ఓవర్లలో 35/0
Pak steady in chasing against Team India
టీ20 వరల్డ్ కప్ సూపర్-12 దశలో నేడు భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయి. దుబాయ్ ఆతిథ్యమిస్తున్న ఈ మ్యాచ్ లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. లక్ష్యఛేదనను పాక్ ఆశాజనకంగా ప్రారంభించింది. 5 ఓవర్లు ముగిసేసరికి ఒక్క వికెట్టు కూడా నష్టపోకుండా 35 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ బాబర్ అజామ్ 14 పరుగులతో, మహ్మద్ రిజ్వాన్ 21 పరుగులతో ఆడుతున్నారు. స్టేడియంలో తమ జట్లను ఉత్సాహపరుస్తూ భారత్, పాక్ అభిమానులు నినాదాలతో హోరెత్తిస్తున్నారు.