6 పరుగులకే ఓపెనర్లు అవుట్... దిగ్భ్రాంతికి గురైన భారత అభిమానులు

24-10-2021 Sun 19:57
  • టీ20 వరల్డ్ కప్ లో నేడు భారత్, పాక్ మ్యాచ్
  • దుబాయ్ దాయాదుల సమరం
  • టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న పాక్
  • ఆరంభంలోనే భారత్ కు ఎదురుదెబ్బ
  • నిప్పులు చెరిగిన షహీన్ అఫ్రిది
Team India losts openers quickly
నరనరాల్లో ఉత్కంఠ నింపుతూ భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. 21 ఏళ్ల పాక్ యువ పేసర్ షహీన్ అఫ్రిది నిప్పులు చెరిగే బంతులతో రోహిత్ శర్మ (0), కేఎల్ రాహుల్ (3) లను అవుట్ చేయడంతో భారత శిబిరంలో తీవ్ర నిరాశ నెలకొంది. అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అప్పటికి స్కోరు కేవలం 6 పరుగులే.

ప్రస్తుతం టీమిండియా స్కోరు 5 ఓవర్లలో 2 వికెట్లకు 30 పరుగులు. క్రీజులో సూర్యకుమార్ యాదవ్ (11 బ్యాటింగ్), విరాట్ కోహ్లీ (15 బ్యాటింగ్) ఉన్నారు. కాగా, రెండు వికెట్లు తీసిన షహీన్ అఫ్రిదిని సూర్యకుమార్, కోహ్లీ చెరో సిక్స్ బాదడం విశేషం.