భారత్-పాక్ మ్యాచ్ నేపథ్యంలో విశాఖలో భారీ బెట్టింగ్ రాకెట్ గుట్టురట్టు

24-10-2021 Sun 19:45
  • టీ20 వరల్డ్ కప్ లో దాయాదుల సూపర్ సమరం
  • విశాఖ మాధవధారలో బెట్టింగ్
  • ఓ అపార్ట్ మెంట్ పై పోలీసుల దాడులు
  • ప్రభాకర్ అనే వ్యక్తి అరెస్ట్
Vizag police busted betting racket
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా, పాకిస్థాన్ జట్ల మధ్య సూపర్ పోరు జరుగుతున్న నేపథ్యంలో విశాఖలో భారీ బెట్టింగ్ రాకెట్ గుట్టురట్టయింది. విశాఖలోని మాధవధారలోని ఓ అపార్ట్ మెంట్ లో బెట్టింగ్ జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ప్రభాకర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.88 వేల నగదు, చెక్ బుక్ లు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఆన్ లైన్ ద్వారా బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు.

ప్రభాకర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు బుకీల కోసం వేట మొదలుపెట్టారు. ఈ బెట్టింగ్ రాకెట్ లో పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు.