శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్ లో కొట్టుకోబోయిన ఆటగాళ్లు... వీడియో ఇదిగో!

24-10-2021 Sun 18:30
  • షార్జాలో బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక
  • లహిరు కుమార, లిట్టన్ దాస్ మధ్య ఘర్షణ
  • లిట్టన్ దాస్ ను అవుట్ చేసిన కుమార
  • ఇరువురి మధ్య మాటల యుద్ధం
  • ఒకర్నొకరు నెట్టుకున్న ఆటగాళ్లు
Liton Das and Lahiru Kumara quarrels each other
శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య షార్జాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ సూపర్-12 మ్యాచ్ లో ఆటగాళ్ల మధ్య ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. బంగ్లాదేశ్ ఆటగాడు లిట్టన్ దాస్ ను అవుట్ చేసిన శ్రీలంక బౌలర్ లహిరు కుమార నోటికి పని కల్పించాడు. దాంతో లిట్టన్ దాస్ కూడా దీటుగా జవాబిచ్చాడు. మాటల యుద్ధం ముదరడంతో ఇరువురు ఆటగాళ్లు బాహాబాహీకి సిద్ధమయ్యారు. ఒకరిని ఒకరు నెట్టుకోగా, ఇతర ఆటగాళ్లు వచ్చి వారిని విడదీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.