టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మరో ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

  • మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి
  • నిన్న 10 మంది అరెస్ట్
  • ఇప్పటివరకు మొత్తం 16 మంది ఆరెస్ట్
  • మిగతా వారి కోసం గాలింపు
  • 4 ప్రత్యేక బృందాల ఏర్పాటు
Police arrests six more people in connection with attack on TDP office

మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేయడం తెలిసిందే. తాజాగా మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 16కి చేరింది. దాడి ఘటన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మీడియా క్లిప్పింగ్స్ ఆధారంగా ఈ కేసులో నిందితులను పోలీసులు గుర్తించారు.

తాజాగా అరెస్టయిన వారిలో కె. మోహన్ కృష్ణారెడ్డి, కాండ్రుకుంట గురవయ్య గుంటూరుకు చెందినవారు కాగా.... షేక్ బాబు, షేక్ సైదా, బంకా సూర్య సురేశ్, జోగరాజు విజయవాడకు చెందినవారు. ఈ కేసులో మిగతా నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

More Telugu News