ఏపీలో మరో 400 కరోనా పాజిటివ్ కేసులు

24-10-2021 Sun 17:53
  • గత 24 గంటల్లో 37,744 కరోనా పరీక్షలు
  • చిత్తూరు జిల్లాలో 73 కేసులు
  • కర్నూలు జిల్లాలో ముగ్గురికి పాజిటివ్
  • రాష్ట్రంలో నలుగురి మృతి
  • ఇంకా 5,102 మందికి చికిత్స
AP covid daily bulletin
ఏపీలో గడచిన 24 గంటల్లో 37,744 కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టగా, 400 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 73 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 68, గుంటూరు జిల్లాలో 50 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 516 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,63,577 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,44,132 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,102 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్య 14,343కి పెరిగింది.