Amit Shah: జమ్మూకశ్మీర్ లో ఆ 3 కుటుంబాల దాదాగిరీ ఇక చెల్లదు: అమిత్ షా

Amit Shah visits Jammu Kashmir
  • జమ్మూకశ్మీర్ లో అమిత్ షా పర్యటన
  • డిజియానాలో గురుద్వారా సందర్శన
  • తీవ్రస్థాయిలో రాజకీయపరమైన విమర్శలు
  • జమ్మూకశ్మీర్ ను 3 కుటుంబాలు భ్రష్టుపట్టించాయని వ్యాఖ్యలు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు జమ్మూకశ్మీర్ లో పర్యటిస్తున్నారు. జమ్ములోని డిజియానాలో గురుద్వారాను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జమ్మూకశ్మీర్ ను 3 కుటుంబాలు భ్రష్టుపట్టించాయని విమర్శించారు. ఆ మూడు కుటుంబాలు 70 ఏళ్ల పాటు జమ్మూకశ్మీర్ కు ఏం ఇచ్చాయని ప్రశ్నించారు. కానీ ఆ 3 కుటుంబాలు బాగుపడ్డాయని, ఆ మూడు కుటుంబాల నుంచి ఆరుగురు ఎంపీలు, 87 మంది ఎమ్మెల్యేలు అయ్యారని అమిత్ షా వివరించారు.

మోదీ ప్రధాని అయ్యాక జమ్మూ కశ్మీర్ లో గ్రామస్వరాజ్యం తెచ్చారని కొనియాడారు. ఇప్పుడు జమ్మూకశ్మీర్ లోని ప్రతి గ్రామంలో పంచాయతీ పాలన జరుగుతోందని వెల్లడించారు. జమ్మూకశ్మీర్ లో గ్రామ ప్రతినిధులుగా 30 వేల మంది ఎన్నికయ్యారని వివరించారు. ఇకపై ఆ మూడు కుటుంబాల దాదాగిరీ జమ్మూకశ్మీర్ లో పనిచేయదని స్పష్టం చేశారు.
Amit Shah
Jammu And Kashmir
Narendra Modi
India

More Telugu News