Baba Ramdev: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రాజధర్మానికి విరుద్ధం: బాబా రాందేవ్

  • టీ20 వరల్డ్ కప్ లో నేడు భారత్ వర్సెస్ పాక్
  • దేశంలో ఓవైపు ఉగ్ర క్రీడ కొనసాగుతోందన్న రాందేవ్
  • క్రికెట్ క్రీడ ఎలా ఆడతారంటూ ఆగ్రహం
  • జాతి ప్రయోజనాలకు విరుద్ధమన్న రాందేవ్ 
Baba Ramdev questions India Pakistan cricket match

ఓవైపు టీ20 వరల్డ్ కప్ లో దాయాదుల సమరం కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంటే, ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ విమర్శలు చేశారు. దేశంలో ఉగ్ర క్రీడ తీవ్రస్థాయిలో సాగుతుంటే, క్రికెట్ క్రీడ అవసరమా? అని ప్రశ్నించారు. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితుల్లో పాకిస్థాన్ తో క్రికెట్ ఆడడం సరికాదని అభిప్రాయపడ్డారు.

ఉగ్ర క్రీడ, క్రికెట్ క్రీడ ఒకేసారి ఆడలేరని స్పష్టం చేశారు. పాకిస్థాన్ తో క్రికెట్ ఆడడం జాతి ప్రయోజనాలకు, రాజ ధర్మానికి విరుద్ధమని బాబా రాందేవ్ పేర్కొన్నారు. టీ20 వరల్డ్ కప్ లో భారత్, పాక్ జట్లు ఒకే గ్రూపులో ఉన్నాయి. ఈ చిరకాల ప్రత్యర్థులు నేటి మ్యాచ్ తో సూపర్-12 ప్రస్థానం ఆరంభిస్తున్నారు.

More Telugu News