తెలంగాణ పదకోశంలో 'బోసిడికె' అంటే 'పాడైపోయిన' అని అర్ధముంది: అయ్యన్న

24-10-2021 Sun 15:49
  • ఏపీ రాజకీయాల్లో దుమారం రేపిన 'బోసిడికె' పదం
  • సజ్జలను అంటే జగన్ అన్వయించుకున్నారన్న అయ్యన్న
  • తల్లి పేరుతో సెంటిమెంట్ కార్డు తీశాడని వెల్లడి
  • సానుభూతి కోసం ఎంతకైనా దిగజారతాడని విమర్శలు
Ayyanna slams YS Jagan
సానుభూతి వస్తుందని అనుకుంటే తనపై తానే ఉమ్మేసుకునే రకం వైఎస్ జగన్ అని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఓట్లు, సీట్లు వస్తాయని తండ్రి, బాబాయిల శవాల దగ్గర్నుంచి, కోడికత్తి వరకు దేన్నీ వదలని జగన్ 'బోసిడికె' పదాన్ని వదులుతాడా? అని వ్యాఖ్యానించారు. తెలంగాణ పదకోశంలో 'బోసిడికె' అంటే 'పాడైపోయిన' అని అర్థం అని సోదాహరణంగా వివరించారు.

సలహాల సజ్జలను 'బోసిడికె' అంటే, సానుభూతి కోసం ఎంతకైనా దిగజారే జగన్ అది తననే అన్నారని అన్వయించుకున్నారని ఆరోపించారు. 'బోసిడి'కె పదానికి పెడర్థాలు తీసి తల్లిపేరుతో కొత్త సెంటిమెంట్ కార్డు బయటికి తీశాడని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. "తల్లిపై నిజంగా ప్రేమే ఉంటే... తల్లిని బూతులు తిట్టినవారికి మంత్రి పదవి ఇవ్వడు, తల్లిని చెల్లిని అలా తెలంగాణ రోడ్లపై అనాథలుగా వదిలేయడు" అని వ్యాఖ్యలు చేశారు.